
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం
తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచారం భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో 150వ మెట్టు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసి భక్తులు కేకలు వేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను టీటీడీ, అటవీ శాఖ అధికారులు గుంపులుగా పంపుతున్నారు.




