తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంపై
టీడీపీ దృష్టి సారించింది. మహానాడులో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్
లోకేశ్, పార్టీ ఆదేశాలను తెలంగాణ క్యాడర్ పాటించాలన్నారు. త్వరలో అక్కడి నాయకులందరినీ కలుస్తానని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు నారా
లోకేశ్ తెలిపారు.