
ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'లీడర్'
లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన 'లీడర్' సినిమా ఏప్రిల్ 3న తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. కథ, కథనాల పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా, యాక్షన్ సీక్వెన్సులు, ట్విస్టులు బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. ఐఎమ్డీబీలో 7.1 రేటింగ్ సాధించిన ఈ సినిమా, థియేట్రికల్ రిలీజ్ అయి 6 వారాలు పూర్తవడంతో, శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటించారు.




