మైనర్‌ బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి

13చూసినవారు
మైనర్‌ బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
AP: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో 5వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి బాలికను ఆటోలో తీసుకెళ్లి, దాడి చేసి తిరిగి వదిలి వెళ్ళినట్లు బాలిక కుటుంబసభ్యులు తెలిపారు. రెండు రోజుల తర్వాత బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, టీడీపీ నాయకులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. బాలికకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్