
బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోదీ నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ 10 స్థానాలకు పైగా గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తమపై ప్రధాని మోదీ, అమిత్షా కుట్ర చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.




