యూపీలోని లఖీమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మహిళా టీచర్ హత్యకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సావుద్ అన్సారీ అనే వ్యక్తి తుపాకీతో పాఠశాలలోకి ప్రవేశించి, విద్యార్థుల ముందే ఉపాధ్యాయురాలిని పైకి ఈడ్చుకెళ్లి సమీపంలో నుంచి కాల్చి చంపాడు. అనంతరం అదే ఆయుధంతో తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.