మహారాష్ట్ర పాల్ఘర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న అన్షిక గౌడ్ అనే విద్యార్థిని స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని టీచర్ దారుణంగా ప్రవర్తించింది. ఆమెతో పాటు ఆలస్యంగా వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులను ఒక్కొక్కరు 100 గుంజీలు తీయమని, అదికూడా వీపుపై స్కూల్ బ్యాగులు పెట్టుకునే తీయాలని చెప్పింది. దీంతో అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న అన్షిక తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే రోజు రాత్రి తల్లి–తండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.