ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఓ విద్యార్థి తన టీచర్‌ను కాల్చాడు. గంగాన్‌దీప్ సింగ్ కోహ్లీ అనే ప్రైవేట్ పాఠశాల సైన్స్ టీచర్ క్లాస్‌లో విద్యార్థిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు తన టిఫిన్ బాక్స్‌లో తుపాకీ దాచుకుని వచ్చాడు. మధ్యాహ్నం విరామం తర్వాత కోహ్లీ క్లాస్‌రూమ్ నుంచి బయటకు వెళ్లే సమయంలో గన్‌తో కాల్పులు జరిపాడు. బుల్లెట్ టీచర్ వీపులో తగలగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడిపై కేసు నమోదు చేశారు.