తరగతి గదిలోనే టీచర్‌కు గుండెపోటు

27905చూసినవారు
తరగతి గదిలోనే టీచర్‌కు గుండెపోటు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. జహీరాబాద్‌లోని నెంబర్‌ 4 ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌ సుజాత బుధవారం ఎప్పట్లాగే పిల్లల హాజరు తీసుకుంటుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. విద్యార్థులు, సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కోహిర్ మండలం పగిడిగుమ్మల్ గ్రామానికి చెందిన సుజాత మృతి పాఠశాల, కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్