టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. విరిగిన పక్కటెముక

9చూసినవారు
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. విరిగిన పక్కటెముక
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఆడుతున్న టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో రన్ తీస్తూ కిందపడటంతో అతడి కుడి పక్కటెముక ముందు భాగంలో స్వల్ప ఫ్యాక్చర్ ఏర్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ గాయంతో సుదర్శన్ సుమారు ఆరు వారాలపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని, దీంతో విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశముందని సమాచారం. ఐపీఎల్ 2026 నాటికి పూర్తిగా కోలుకుని మైదానంలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్