
ఈ పథకాలు రైతుల జీవితాలను మారుస్తాయి: మోదీ (వీడియో)
పీఎం ధన్ ధాన్య కృషి యోజన, దల్హన్ ఆత్మనిర్భరత మిషన్ స్కీమ్స్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకాలు కోట్లాది మంది రైతుల జీవితాలను మారుస్తాయని, వీటిపై రూ.35 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టనుందని తెలిపారు. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, అన్నదాతల ముఖాల్లో ఆనందం చూడటమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. దేశంలో తమ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.




