ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆదివారం (నేడు) వేడి పుట్టించే మ్యాచ్ జరగనుంది. దాయాది పాక్ టీమ్‌తో భారత్ ఇవాళ తలపడనుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తొలిసారి భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. బలాబలాల్లో భారత్ ముందు పాక్ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.