పూణేకు చెందిన 23 ఏళ్ల ఐటీ ఇంజనీర్ వైష్ణవి ప్రవీణ్ జరండే పెళ్లైన 5 నెలలకే ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. మే 9న జరిగిన వివాహంలో రూ. 45 లక్షలు, 10 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, అదనంగా రూ. 5 లక్షలు కారు కోసం తీసుకురావాలని వేధించారని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సెప్టెంబర్ 24 రాత్రి వేధింపుల గురించి తల్లికి చెప్పిన వైష్ణవి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కట్న నిషేధ చట్టం, ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.