విమానంలో సాంకేతిక లోపం.. చైనా గగనతలం నుంచి వెనక్కి

7చూసినవారు
విమానంలో సాంకేతిక లోపం.. చైనా గగనతలం నుంచి వెనక్కి
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా ఎనిమిది గంటలు గాల్లోనే ప్రయాణించి, చైనా గగనతలం మీదుగా తిరిగి ఢిల్లీకి చేరుకుంది. బుధవారం బయలుదేరిన ఈ బోయింగ్‌ 777-300 ER విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగా తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిందని, సమస్యను పరిష్కరించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్