
జగన్ పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు: వైసీపీ (వీడియో)
AP: మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని వైసీపీ పేర్కొంది. పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని మండిపడింది. పమిడిముక్కల మండలం గోపవానిపాలెం వద్ద ప్రజలెవరూ రాకుండా పోలీసులు తాళ్లతో అడ్డుకుంటున్నారని పైరయ్యింది. చంద్రబాబు పర్యటనకు జనం రారనే కోపంతో.. జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపించింది.




