
టీవీకే చీఫ్ విజయ్‌కు వరుస షాక్‌లు.. ప్రచార రథం సీజ్
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరోవైపు రోడ్డు ప్రమాద ఘటనలో విజయ్ ప్రచార రథం సీజ్ చేశారు. తొక్కిసలాట ఘటనకు ముందు విజయ్ ప్రచార రథం బస్సు ప్రమాదం జరిగింది. ఇద్దరు బైకర్లు బస్సు కింద పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో విజయ్ బస్సు డ్రైవర్‌పై పోలీస్ కేసు నమోదు చేశారు.




