
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత
అఖిల భారత వీరశైవ మహాసభ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే షామనూర్ శివశంకరప్ప (94) బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్సకు స్పందించకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన కేపీసీసీ కోశాధికారిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున ఉద్యానవన శాఖ మంత్రిగా, ఆయన కోడలు ప్రభా మల్లికార్జున ఎంపీగా ఉన్నారు.




