దుబాయ్ ఎయిర్ షో ఘటనపై అమెరికా పైలట్ నిరసన

14734చూసినవారు
దుబాయ్ ఎయిర్ షో ఘటనపై అమెరికా పైలట్ నిరసన
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోవడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్ మేజర్ టేలర్ ‘ఫెమా’ హైస్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన పైలట్ గౌరవార్థం తమ బృందం తుది ప్రదర్శనను రద్దు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, నిర్వాహకులు ఎయిర్ షోను కొనసాగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.