బిహార్ ఎగ్జిట్ పోల్స్‌పై తేజస్వీ యాదవ్ స్పందన (వీడియో)

14964చూసినవారు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలను చూపించవని, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే వీటిని వాడుతారని ఆయన ఆరోపించారు. 2020తో పోలిస్తే ఈసారి బీహార్‌లో 72 లక్షల మంది ఓటర్లు ఎక్కువగా ఓటు వేశారని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతేనని, మార్పు కోసమేనని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ విజయం సాధిస్తుందన్న అంచనాలను తోసిపుచ్చుతూ, తమకు 160కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు.