టీబీజేపీ వ్యూహం.. ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యమా?

4071చూసినవారు
టీబీజేపీ వ్యూహం.. ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యమా?
TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ తెలంగాణలో తన కార్యక్షేత్రాన్ని మార్చుకుంటోందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బలహీనంగా ఉన్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలను కలుపుతూ వచ్చే ఏడాది జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ట్రయల్ రన్‌గా భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాల కోసం వరంగల్ కేంద్రంగా నియమితులైన బీఎల్ సంతోష్ సన్నిహితుడు దశరథ్, ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్