రేపు సా. 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పంటనష్టం సాయంతో పాటు కొత్త ROR చట్టానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. హైడ్రాకు కొత్త ఆర్డినెన్స్ తో పాటు పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వరదబాధితులకు ఆర్థిక సహాయంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. 3 యూనివర్సిటీల పేరు ఖరారుపై చర్చించనున్నారు.