TG: త్వరలో రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగనుంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో క్యాబినేట్‌లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు టాక్. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉంది. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్లు సమాచారం. అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆది శ్రీనివాస్‌కు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇక పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉన్నట్లు వినిపిస్తోంది.