ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తం

23చూసినవారు
ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తం
TG: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలు, ఎస్‌ఎస్‌ఏలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు. బీజేపీ తెలంగాణను లక్ష్యంగా ఎంచుకుందని ఆరోపించారు. ప్రతి వారం మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్ల జాబితా, పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలును పరిశీలిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్