‘ఆల్మంట్- కిడ్’ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్ ఆదేశం

145చూసినవారు
‘ఆల్మంట్- కిడ్’ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్ ఆదేశం
‘ఆల్మంట్-కిడ్’ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ కలుషితం ఉన్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించి హెచ్చరిక జారీ చేసింది. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎవరి వద్దనైనా ఈ సిరప్ ఉంటే వెంటనే వాడకం, విక్రయాన్ని ఆపాలని సూచించింది. పిల్లలకు వినియోగించే ఔషధం కావడంతో తల్లిదండ్రులు, వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్