‘ఓజీ’ ప్రీమియర్‌కు తెలంగాణ సర్కార్‌ అనుమతి

28876చూసినవారు
‘ఓజీ’ ప్రీమియర్‌కు తెలంగాణ సర్కార్‌ అనుమతి
‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అవకాశం కల్పించింది. జీఎస్టీతో కలిపి టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. సినిమా విడుదలైన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరల పెంపునకు వీలు కల్పించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్