TG: వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నెల 1 నుంచే గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పథకం అమలుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం వాటా 60% రూ.3,825.31 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇక రాష్ట్రం తన 40% వాటా కింద రూ.2550.21 కోట్లను విడుదల చేయాలి. కాగా గతంలో ఉపాధి హామీలో ప్రతి కూలీకి 100 పనిదినాలు ఉండగా, ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 125 పనిదినాలు ఉండనున్నాయి.