వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

0చూసినవారు
వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
కేంద్ర ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని భావిస్తున్న వీబీజీ రాంజీ స్కీంపై నిరసన తెలపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అసెంబ్లీలో ఇప్పటికే ఈ స్కీంను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశామని ఆమె పేర్కొన్నారు. ఈ స్కీం అమలుపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు ఉపాధికి బ్రేక్ ఇవ్వాలనే నిబంధనను తొలగించాలని, డిమాండ్‌కు అనుగుణంగా కాకుండా నార్మెటివ్ పద్ధతిలో పని దినాలు కేటాయించే విధానాన్ని సవరించాలని మంత్రి కోరారు.

సంబంధిత పోస్ట్