స్కూల్ బస్సులకు గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

14చూసినవారు
స్కూల్ బస్సులకు గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బస్సుల భద్రతపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులకు చెల్లుబాటు అయ్యే పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని స్పష్టం చేసింది. అనుభవం ఉన్న లైసెన్స్‌డ్ డ్రైవర్లను మాత్రమే నియమించాలని, సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను తీసుకెళ్లరాదని ఆదేశించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్