తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా బదిలీలు చేపట్టింది. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసింది. ఆమెను తెలంగాణ హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొనసాగుతున్న ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం కుట్రపూరితంగా బదిలీ చేసిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.