అప్పులతో తెలంగాణను సర్వనాశనం చేశారు: భట్టి విక్రమార్క

7152చూసినవారు
అప్పులతో తెలంగాణను సర్వనాశనం చేశారు: భట్టి విక్రమార్క
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు... ఆయన పాలనలో జరిగిన అప్పులపై స్పందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులున్నాయని, అందులో గత ప్రభుత్వ బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ అప్పులు వాస్తవమేనా, వీటిని ఎవరు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్