కాళేశ్వరం కమిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో తీర్పు

5చూసినవారు
కాళేశ్వరం కమిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో తీర్పు
TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనుంది. దీంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్