తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

30చూసినవారు
తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్‌ (TG ICET Results 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డును పొందవచ్చు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షను మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ) నిర్వహించింది. మే 13, 14 తేదీల్లో ఈ పరీక్ష జరగ్గా, ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. https://icet.tgche.ac.in/ ఫలితాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్