TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వడగాలుల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, హైదరాబాద్‌లోనూ 42 డిగ్రీలకు పైగా వేడి నమోదైంది. రాబోయే మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.