తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. వరంగల్, హైదరాబాద్‌లలో చదువుకుని, లండన్ యూనివర్సిటీ కాలేజీలో పాలనా శాస్త్రంలో పీజీ చేసిన ఉదయ్‌ను ప్రధానమంత్రి సలహా మేరకు ఈ పదవికి ఎంపిక చేశారు. గతంలో లేబర్ పార్టీ తరపున బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఉదయ్‌ను, నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంటరీ క్యాండిడేట్‌గా ప్రకటించారు.