తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన అనూహ్య విజయంపై తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ అద్భుత విజయానికి సోషల్ మీడియాలో చేసిన 'రీల్స్' కూడా ఎంతగానో దోహదపడ్డాయని, కళలకు ఎంతో శక్తి ఉందని, వినూత్నంగా ఆలోచిస్తే విజయం తథ్యమని పేర్కొన్నారు. 2024లో పార్టీని స్థాపించిన రెండేళ్లకే విజయ్ ఈ ఘనత సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.