తెలంగాణ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ‘బోర్డ్ ఆఫ్ ట్రేడ్’ సమావేశంలో పాల్గొననుండగా, పంచాయతీరాజ్ మంత్రుల వర్క్‌షాప్‌కు మంత్రి సీతక్క హాజరుకానున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.