తెలంగాణ ప్రజలు హరీష్ రావు హరి కథలను నమ్మరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. నల్లమల సాగర్ కు సీడబ్ల్యూసీ క్లియర్స్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను జలగల్లా దోచుకున్న దొంగలు నీతి వ్యాఖ్యలు పలుకుతున్నారని, హరీష్ రావు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో హరీష్ రావు, కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు.