తెలంగాణ పీజీఈసెట్ (TG PGECET) 2026 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 2 నుండి జులై 9 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల అప్‌లోడ్, ఫీజు చెల్లింపు జరుగుతుంది. ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరి
ఫికేషన్ జూలై 8, 9 తేదీల్లో, అర్హుల జాబితా జూలై 12న, వెబ్ ఆప్షన్ల ఎంపిక జూలై 13-15 వరకు ఉంటాయి. జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ600 రిజిస్ట్రేషన్ ఫీజు. గేట్ అర్హత సాధించినవారు కూడా అర్హులే.