తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం

62చూసినవారు
తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్‌, ప్రస్తుతం విధుల్లో ఉన్న పలువురు ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను ఉపసంహరించుకుంది. మొత్తం 26 మంది అధికారుల నుంచి ఈ వాహనాలను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కూడా తొలగించింది. అలాగే పలువురు రాజకీయ నేతలు, పోలీస్‌ అధికారులకు ఉన్న భద్రతను పునఃసమీక్షించి 67 మంది ప్రముఖులకు గన్‌మెన్ల సంఖ్యను తగ్గించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్