దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సానుకూల వృద్ధి నమోదైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ నెలలో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూను సాధించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి అందిన పోస్ట్-సెటిల్మెంట్ SGST మొత్తం రూ.22,231 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ జీఎస్టీ వసూళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్లో రూ.3,599 కోట్ల డొమెస్టిక్ జీఎస్టీ రెవెన్యూ, 6 శాతం వృద్ధి నమోదైంది.