TG: పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇస్తే అసలు ఇష్యూనే అయ్యేది కాదని
బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. 'మీటింగ్ పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది. ప్రధాని
మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్తేనే కొంతమందికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. తెలంగాణను వ్యతిరేకించిన MIMతో దోస్తీ చేస్తూ, అలాంటి వాళ్లను మీ పార్టీలో చేర్చుకోలేదా?' అని ప్రశ్నించారు.