తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. నదీ జలాలపై మేము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పేరు మారినా, తెలంగాణకు ద్రోహం మారలేదు. ప్లాన్ ప్రకారమే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు' అని ఆరోపించారు.