TG: వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేట మండలం బుచ్చినాయక్ తండాకు చెందిన వైష్ణవి.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ట్రిపుల్ ఐటీడీఎంలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. వైష్ణవి మృతికి చెన్నారావుపేటకు చెందిన బోడ సుమన్ కారణమంటూ బాధితురాలి బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం పేరిట వైష్ణవిని మోసం చేశాడంటూ అతడి ఇంటివద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.