నేడు ‘తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ -2047’ ఆవిష్కరణ

39చూసినవారు
నేడు ‘తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ -2047’ ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’ అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు 44కు పైగా దేశాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు హాజరయ్యారు. సమ్మిట్‌ తొలి రోజున సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు కార్యక్రమాలపై నిపుణులతో చర్చలు జరిగాయి. రెండో రోజైన మంగళవారం ‘తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ -2047’ ఆవిష్కరించనున్నారు. పోలీస్‌ శాఖ భారీ భద్రతా చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్