లెక్కలు నేర్చుకోవాలన్న టెలిగ్రామ్‌ సీఈవో.. ఫిజిక్స్‌ అంటున్న ట్విట్టర్ సీఈవో

12228చూసినవారు
లెక్కలు నేర్చుకోవాలన్న టెలిగ్రామ్‌ సీఈవో.. ఫిజిక్స్‌ అంటున్న ట్విట్టర్ సీఈవో
విద్యార్థులు భవిష్యత్తులో విజయం సాధించాలంటే లెక్కలు (మ్యాథమేటిక్స్)పై దృష్టి పెట్టాలని టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ సూచించారు. ఎక్స్‌ వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ‘‘ఫిజిక్స్ (లెక్కలతో పాటు)’’ అని అన్నారు. దురోవ్ కూడా "+1" అంటూ సమాధానం ఇచ్చారు. ఫిజిక్స్‌, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులు లాజికల్ ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్