తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ను రష్యా అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ప్రోత్సహించే కంటెంట్‌ను కట్టడి చేయడంలో టెలిగ్రామ్ విఫలమైందని రష్యా ఆరోపించింది. కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తోందని కూడా రష్యా ఆరోపించింది. ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంల వినియోగంపై నియంత్రణకు ప్రయత్నిస్తున్న రష్యా, ఇప్పటికే ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లపై ఆంక్షలు విధించింది.