నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండగా, ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే కోశాధికారి పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల ప్రక్రియపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.