ఒమన్‌లో చిక్కుకున్న తెలుగింటి ఆడబిడ్డ సురక్షితం

4చూసినవారు
ఒమన్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లాకు చెందిన శానవాజ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సురక్షితంగా మాతృభూమికి చేరుకున్నారు. తనను కాపాడాలంటూ ఆమె పంపిన వీడియోపై స్పందించిన పవన్, వెంటనే విదేశీ వ్యవహారాల శాఖ, ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను రప్పించేలా చర్యలు తీసుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న శానవాజ్, పవన్ కళ్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు వ్యక్తి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ ఈ సందర్భంగా భరోసానిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్