ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. గౌరీకుండ్‌లో రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో 10వేలకు పైగా భక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గౌరీకుండ్ వద్ద చిక్కుకున్న వారిలో 40 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం.