తెలుగు సీరియల్‌ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌

36చూసినవారు
తెలుగు సీరియల్‌ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్‌
ఫేస్‌బుక్‌లో వేధిస్తున్న యువకుడిపై కన్నడ, తెలుగు సీరియల్ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు 'నవీన్' అనే యువకుడిని అరెస్ట్ చేశారు. నటి ఫేస్‌బుక్ రిక్వెస్ట్‌ను తిరస్కరించడంతో, అతను లైంగికంగా వేధించడం, అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. బ్లాక్ చేసినా ఫేక్ అకౌంట్ల ద్వారా వేధింపులు కొనసాగడంతో నటి పోలీసులను ఆశ్రయించారు. ఈ వేధింపుల వల్ల మానసిక క్షోభకు గురైనట్లు నటి ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్